సురేష్‌ ప్రభుకు అదనపు బాధ్యతగా పౌరవిమానం

Suresh Prabhu
Suresh Prabhu

సురేష్‌ ప్రభుకు అదనపు బాధ్యతగా పౌరవిమానం

న్యూఢిల్లీ,మార్చి11, కేంద్రానికి చెందిన ఇద్దరు మంత్రులు చేసిన రాజీనామాను శుక్రవారం రాZషపతి ఆమోదించారు. దీంతో పౌరవిమానయాలన శాఖ ను అదనపు బాధ్యతగా కేబినెట్‌ మంత్రి అయిన సురేష్‌ ప్రభుకు కేటాయించాలని ప్రధాని సూ చించారని రాZషపతి భవన్‌ అధికారులు తెలిపారు. దీనికి రాZషపతి శనివారం ఆమోద ముద్ర వేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చటంలో కేంద్ర ప్రభుత్వం చూపి స్తున్న నిర్లక్ష్యానికి, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు, ప్రత్యేక ప్యాకేజీలో కూడా కదలికలు తేనందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్ర బాబు తీవ్ర నిరసనతెలిపారు. ఆతర్వాత కేంద్ర ప్రభు త్వంనుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆపార్టీ కేంద్ర మంత్రులు అశోకగజపతి రాజు, వైఎస్‌.చౌదరిలు గురువారం రాజీనామాను సమ తర్పించిన విషయం విదితమే.