సుప్రీంకు వెళుతున్న అనర్హత ఎమ్మెల్యేలు

TN MLAs
TN MLAs

మదురై: తమిళనాడులో అనర్హతవేటు పడిన ఎఐఎడిఎంకెఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాస్థానంలో అప్పీలు చేయాలనినిర్ణయించారు. మద్రాసు హైకోర్టు తమపై వేసిన అనర్హత ఉత్తర్వులను సవాల్‌చేస్తూ సుప్రీంలో దాకలుచేస్తామని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌ పి.ధన్‌పాల్‌ గత ఏడాది మొత్తం 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసిన సంగతి తెలిసిందే. అనర్హత వేటుపడిన తంగతమిల్‌సెల్వన్‌అనే ఎమ్మెల్యే ఎంఎండికె నేత టిటివి దినకరన్‌కు ప్రధాన అనుయాయుడిగా మెలిగారు. ఆయన మాట్లాడుతూ సుప్రీంలో అప్పీలుచేయాలన్న వాదనకు అందరు 18 మంది ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయంతో ఉన్నారని వెల్లడించారు. దినకరన్‌ సమక్షంలో అనర్హత వేటుపడిన ఎమ్మెల్యేలు అందరూ చర్చించుకున్న అనంతరం ఈనిర్ణయాన్ని ప్రకటించారు. స్పీకర్‌ చేసిన తప్పిదాన్ని సమాజానికి తెలియజేసేందుకే తాము సుప్రీం కోర్టుకు వెళ్లదలిచామని అందువల్లనే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేస్తామన్నారు. గురువారం మద్రాస్‌ హైకోర్టు చీఫ్‌జస్టిస్‌ 18 మంది ఎఐఎడిఎంకె ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్‌ ప్రకటించిననిర్ణయాన్ని సమర్ధించారు. దీనితో పళనిస్వామి ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించినట్లయింది. ఈ 18 మంది కూడా దినకరన్‌కు విధేయులుగాకొనసాగుతున్నారు. ఎఎంఎంకె పార్టీని స్థాపించిన దినకరన్‌ బహిష్కరణకు గురైన వికె శశికళకు బంధువు కూడా కావడం గమనార్హం. 2017 సెప్టెంబరులో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌ పి.ధన్‌పాల్‌ 18 మంది ఎఐఎడిఎంకె ఎమ్మెల్యేలను 1986 తమిళనాడు అసెంబ్లీ సభ్యుల పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంకింద అనర్హత వేటు వేసారు. రెబెల్‌ అభ్యర్ధి దినకరన్‌కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో వీరిపై వేటుపడింది. ప్రజాప్రతినిదులు మొత్తం గవర్నర్‌ సి.విద్యాసాగర్‌రావును కలిసి ముఖ్యమంత్రి ఇకె పళనిస్వామిపై ఫిర్యాదుచేసి ఆయన్ను పదవినుంచి తొలగించాలని డిమాండ్‌చేసారు. అంతేకాకుండా స్పీకర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేలు మొత్తం హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేసారు. హైకోర్టు చీఫ్‌జస్టిస్‌ ఇచ్చిన తీర్పుఉను ఎఐఎడిఎంకె స్వాగతించింది. అయితే డిఎంకె మాత్రం ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తూ ఉప ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావాలని డిమాండ్‌చేసింది. అయితే తన శిబిరానికి ఇదొక చెంపపెట్టులాంటిదని, అయితే తమ పార్టీ ఎఎంఎండికెకు ఇదొక అనుభవమని దినకరన్‌ వ్యాఖ్యానించారు. అయితే ఉప ఎన్నికలంటూ జరిగితే తమ విధేయులు మంచిమెజార్టీతో గెలుపొందుతారని వెల్లడించారు.తీర్పుతర్వాత పరిణామాలు తమ విధేయులను మరింత శక్తివంతులను చేసిందని దినకరన్‌ వెల్లడించారు. 18 సీట్లు ప్రస్తుతం ఖాళీ అయ్యాయని, ఎఐఎడిఎంకె అన్ని స్థానాల్లోను గెలుస్తుందని సీఎం పళనిస్వామి వెల్లడించారు. హైకోర్టులోని డివిజెన్‌ బెంచ్‌ జస్టిస్‌ బెనర్జీ, జస్టిస్‌ ఎంసుందర్‌లు భిన్నమైన తీర్పును ఇచ్చారు. జూన్‌ 14 వతేదీ తీర్పులో బెనర్జీ స్పీకర్‌ నిర్ణయాన్ని సమర్ధిస్తే సుందర్‌ మాత్రం తన అసమ్మతిని వ్యక్తంచేసారు. ఇదేతరునంలో సుప్రీంకోర్టు జస్టిస్‌ ఎం సత్యనారాయణన్‌ను విచారణకు నియమించింది. సత్యనారాయణన్‌ కూడా విచారణకు సంబంధించిన అన్ని అంశాలు పరిగణనలోనికి తీసుకునే స్పీకర్‌ నిర్ణయం ప్రకటించారని, అనర్హతవేటును సమర్ధించారు. ఈ విచారణలో తన స్వతంత్ర అభిప్రాయాలను వెల్లడించానని, అంతకుముందు ఇద్దరు జడ్జిల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోకుండా స్వతంత్ర విచారణతోనే తీర్పును ప్రకటించినట్లు సత్యనారాయణన్‌ ప్రకటించారు. అయితే ఈ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంలో అప్పీలుచేసేందుకు 18 మంది ఎమ్మెల్యేలు నిర్ణయించడంతో తమిళనాట రాజకీయాలు మరోమలుపు తిరిగినట్లయింది.