సార్వత్రిక ఎన్నికల కోసం ఇండియా టుడే-కార్వీ సర్వే

 

Rajnath singh
Rajnath singh

న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జాతీయ అంశాల పై ప్రజానాడి తెలుసుకోవడానికి ఇండియా టుడే-కార్వీ సర్వే చేసింది. అయితే ఈసర్వేలో ప్రధాని మోడి మంత్రివర్గంలోని హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అత్యుత్తమ పనితీరును ప్రదర్శించారు. సర్వేలో పాల్గొన్న 13వేల మందిలో అత్యధికులు ఆయనకే ఓటువేశారు. తరువాత స్ధానాల్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లు ఉన్నారు. ట్విటర్‌లో చురుగ్గా వ్యవహరించే సుష్మా స్వరాజ్..విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు సాయం చేయడంలో వేగంగా స్పందిస్తారని పేరు తెచ్చుకున్నారు. సంపాదించుకున్నారు.