సామాన్యుడికి దక్కాల్సిన హక్కు కోసమే

 

Modi in Agra Meeting
Modi

సామాన్యుడికి దక్కాల్సిన హక్కు కోసమే

ఆగ్రా: సామాన్యుడికి దక్కాల్సి హక్కుకోసమే పెద్దనోట్లను రద్దుచేయటం జరిగిందని ప్రధాని మోడీ అన్నారు. ఆగ్రాలో ప్రదౄనమంత్రి ఆవాస్‌ యోజన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నల్లధనం నియంత్రణ కోసం తాను తీసుకున్న చర్యను ప్రజలందరూ స్వాగతించారని, పేర్కొన్నారు. మీ కలను సాకారం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ పని చాలా పెద్దది, సమయం పడుతుందన్నారు. అందుకే తాను 50 రోజల సమయం అడిగానని అన్నారు. మనమంతా ఇ్బందులు పడాల్సి ఉంటుందని ముందే చెప్పానని గుర్తుచేశారు. నవంబర్‌ 8 తర్వాత విద్యుత్‌ బకాయిలు వసూలయ్యాయని అన్నారు.. గడిచిన 10 రోజుల్లో రబ్యాంకుల్లో రూ.5 లక్షల కోట్ల పాతనోట్లు జమఅయ్యాయని తెలిపారు.