శశిథరూర్‌ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి..

SHASHI THAROOR
SHASHI THAROOR

న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీలోని పటియాలా కోర్టు అనుమతినిచ్చింది. ఇటీవల కన్నుమూసిన ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి కోఫిఅన్నన్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. కాగా వరదల్లో చిక్కుకున్న కేరళకు సాయం కోసం అర్ధించేలా ఐరాస ప్రధాన కార్యాలయానికి వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతి తెలిపింది. తన భార్య సునందా పుష్కర్‌ అనుమానాస్పద మృతి కేసులో శశిథరూర్‌ విచారణ ఎదుర్కోంటునన్న సంగతి తెలిసిందే.