శశికళపై ఆరోపణల ఫలితం: ఐపిఎస్‌ అధికారి బదిలీ

DIG Roopa
DIG Roopa

శశికళపై ఆరోపణల ఫలితం: ఐపిఎస్‌ అధికారి బదిలీ

బెంగళూరు: బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు డిఐజి డి.రూపను కర్ణాటక ప్రభుత్వం బదిలీ చేసింది.. జైలు డిజైజి పదవి నుంచి ఆమెను ట్రాఫిక్‌ విభాగానికి బదిలీ చేశారు. జైలులో ఎఐఎడిఎంకె నాయకురాలు శశికళకు రాజబోగాలు అందుతున్నాయని , దీనికోసం ఆమె రూ.2 కోట్లు లంచంగా ఇచ్చిందని పేర్కొందటూ దీనిపై విచారణ జరిపించాలని రూప ఉన్నతాధికారులకు లేఖరాసిన విషయం విదితమే.. ఈ లేఖతో కర్ణాటకలో వివాదం రాజుకుంది.. దీంతో ఆమెను ట్రాఫిక్‌ విభాగానికి బదిలీ చేశారు.