శబరిమలలో సెక్షన్‌ 144 పొడిగింపు

shabarimala copy
shabarimala

తిరువనంతపురం: శబరిమలలో వయసుతో నిమిత్తం లేకుండా మహిళలందికి శబరిమల ఆలయంలోకి ప్రవేశ కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అధికారులు విధించిన నిషేదాజ్ఞలు నేటి రాత్రి ముగియనున్నాయి. అయితే ఆ నిషేదాజ్ఞలు ఈనెల 8 అర్థరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు పతనందిట్ట జిల్లా కలెక్టర్‌ పీబీ నూహ్‌ సహా ఇతర అధికారుల నుండి అందిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ప్రతిఏటా రెండు నెలలపాటు జరిగే తీర్థయాత్రల కోసం గతనెల 17న శబరిమల ఆలయాన్ని తెరిచారు.