శబరిమలలో భక్తులకు మకర జ్యోతి దర్శనo

Sabari Mala
Sabari Mala

శబరిమల: భక్తులకు మకర జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు శబరిమలకు తరలివచ్చారు.  సాయంత్రం 6.45 నుండి 7 గంటల మధ్యలో మకర జ్యోతిని దర్శించుకున్న భక్తజనం పులకించిపోయారు. జ్యోతి దర్శనం సమయంలో స్వామియే శరణమయ్యప్ప అంటూ శబరిమల క్షేత్రం మారుమోగింది. రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మకరజ్యోతి దర్శనం సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పులిమేఢు, నీలికాల్, పరియణా వట్టం, పంబా ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.