ఎమ్మెల్యెకు నోటిసులు

 

KUMARA SWAMY
KUMARA SWAMY

బెంగాళూరు: కాంగ్రెస్‌ ఎమ్మెల్యెలు సిద్ధరామయ్య సిఎం అంటూ పదేపదే వ్యాఖ్యలు చేస్తే తాను సిఎం పదవికి రాజీనామా చేస్తానని సిఎం కుమారస్వామి చేసిన హెచ్చరికలకు కాంగ్రెస్‌ సీరియస్‌గా తీసుకుంది. కుమారస్వామికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యె ఎస్‌టీ సోమశేఖర్‌కు నోటీసులు జారీ చేయాలని కర్ణాటక కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ను ఆదేశించారు. సోమశేఖర్ వ్యాఖ్యలపై వివరణ కోరాలని వేణుగోపాల్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.