వెల్‌లోనికి దూసుకువస్తే ఎంపిలపై సస్పెన్షన్‌వేటు!

loksabha
loksabha

లోక్‌సభ నిబంధనల కమిటీ సిఫారసులు
న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశం సమయాల్లోప్రతిపక్షాలు నేరుగా వెల్‌లోనికి దూసుకుని రావడం, సభాకార్యక్రమాలకు నిరంతరాయంగా ఆటంకాలు కలిగిస్తున్న వారిని వెంటనే సస్పెండ్‌చేయాలని లోక్‌సభ నిబందనల కమిటీ శుక్రవారం స్పీకర్‌కు సిఫారసుచేసింది. పదేపదే వెల్‌లోనికి దూసుకువచ్చి నిరసన వ్యక్తంచేసేవారిని ఆటోమేటిక్‌గా సస్పెండ్‌చేయాలని సూచించింది. అలాగే సభాఛైర్మన్‌ప దేపదే వారించినా నిరసన నినాదాలుచేసినా వారిపై కూడా చర్యలు తీసుకోవాలనిసూచించింది. శీతాకాలసమావేశాలు ప్రారంభం అయి తొమ్మిదిరోజులు గడుస్తున్నా సభాకార్యక్రమాలకు సభ్యులు తరచూ అంతరాయం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఏఒక్కరోజు కూడా సజావుగా ఉభయసభలు జరిగిన దాఖలాలులేవు. ఐదుసార్లు సమావేశం అయినా కూడా అలాగే కొనసాగితేసస్పెండ్‌చేయాలని, లేదా ఆ సమావేశాల మిగిలినరోజులు ఏది తక్కువ అయితే అది ప్రామాణికంగాతీసుకుని సస్పెండ్‌చేయాలని సూచించింది. ఎంపిలు తరచూ లోక్‌సభలో ప్లకార్డులుచేతబూని సభకు అంతరాయం కలిగిస్తుండటంపై స్పీకర్‌ మహాజన్‌ ముందురోజు ఒక సమావేశాన్ని ఇర్వహించారు. లోక్‌సభ నిబందనలు, విధానం, బిజినెస్‌ నిర్వహణ వంటి నబంధనల్లో రూల్‌ 374(ఎ)(1) కింద ఒక సభ్యుణ్ణి సస్పెండ్‌చేసే అధికారాలను స్పీకర్‌కు కల్పిస్తున్నాయి. స్పీకర్‌ నిరసనతెలిపే సభ్యులను పదేపదే వారిస్థానాల్లోనికి వెళ్లాలని కోరినప్పటికీ వారు వెళ్లకపోయినట్లయితే వారిని వెంటనే సస్పెండ్‌చేయవచ్చనిసూచించింది. స్పీకర్‌ వారి పేర్లతోసహా ప్రకటించవచ్చని వెల్లడించింది. సభ సాంప్రదాయాలను ఉల్లంఘించి, ఉద్దేశ్యపూర్వకంగా సభాకార్యక్రమాలకు అడ్డుతగలడం, నినాదాలు ఇవ్వడం వంటి వాటిపైనా సస్పెండ్‌చేయవచ్చని కమిటీసూచించింది. వీరందరినీ ఐదు సమావేశాలవరకూ సస్పెండ్‌ చేయవచ్చని లేదా పార్లమెంటు సమావేశాలుముగిసేంతవరకూ కూడా సస్పెండ్‌చేయవచ్చని నిబంధనల కమిటీ సిఫారసుచేసింది. స్పీకర్‌ ఒకసారి హెచ్చరించి సభను స్వల్పసమయం పాటు వాయిదా వేసిన తర్వాత సెక్రటరీజనరల్‌ సభ్యుల పేర్లను గుర్తించి స్పీకర్‌కు అందచేస్తారు. అయితే సస్పెన్షన్‌పట్ల కమిటీ సబ్యుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. టిఎంసి ఎంపి సౌగతారా§్‌ు ఈ సస్పెన్షన్‌ కేవలం ఒకరోజు మాత్రమే ఉండాలని చేసిన సూచనకు ఇతర పార్టీల ఎంపిలుసైతం మద్దతిచ్చారు. నిబంధనల కమిటీ స్పీకర్‌కు సలహా సంస్థగా పనిచేస్తుంది. నిబందనలకు సవరణలు తీసుకురావాలన్నా, సభాకార్యక్రమాలు సజావుగా జరగాలన్నా స్పీకర్‌కు సలహాలు సూచనలు ఇస్తుంటుంది. ఈ ప్రతిపాదనలను లోక్‌సభ సెక్రటేరియట్‌ ఆమోదించిన తర్వాత కమిటీ ముందుకు వస్తుంది. రాజ్యాంగంలోని 118(1)ప్రకారంచూస్తే పార్లమెంటు హౌస్‌కమిటీ నిబందనలు, విధానాలను రూపొందించవచ్చని తేల్చింది. 1950 ఏప్రిల్‌ ఒకటవ తేదీ స్పీకర్‌ ఒకప్రకటనచేస్తూ ఈ నిబందనల పరిశీలన కమిటీ సభ్యులనుంచి వచ్చిన సలహాలు సూచనలు స్వీకరించి సమయానుకూలంగా నిబందనలు సవరిస్తుందని వెల్లడించారు. అప్పటినుంచి ఈ కమిటీలు పనిచేస్తున్నాయి.