విశ్వ విద్యాల‌యాల పేర్ల‌ను మార్చాలిః యుజిసి ప్యానెల్‌

banaras hindu university
banaras hindu university

దేశవ్యాప్తంగా పది సెంట్రల్ యూనివర్సిటీల్లో జరుగుతున్న అక్రమాలపై దర్యాప్తు చేయ‌డానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఆ ప‌నిలో ఉన్న స‌ద‌రు ప్యానెల్ తాజాగా ఓ విష‌యాన్ని లేవ‌నెత్తింది. యూనివ‌ర్సిటీ పేర్ల‌లో ముస్లిం, హిందూ వంటి ప‌దాలు ఉండ‌కూడ‌ద‌ని సిఫార్సు చేసింది. బనారస్ హిందూ విశ్వ‌ విద్యాల‌యం, అలీగఢ్ ముస్లిం వ‌ర్సిటీల నుంచి ఆయా పేర్ల‌ను తొల‌గించాల‌ని కోరింది. కేంద్ర ప్ర‌భుత్వం నిధులు మంజూరు చేసే ఆయా వ‌ర్సిటీలు లౌకిక విద్యాసంస్థలని గుర్తు చేసింది. ఆ విశ్వ విద్యాల‌యాల‌కు అలీగఢ్ వర్సిటీ, బనారస్ యూనివర్సిటీగా పిలవచ్చని చెప్పింది. లేదంటే ఆ వ‌ర్సిటీల‌ వ్యవస్థాపకుల పేర్లు పెట్టొచ్చని పేర్కొంది.