విశాల్ కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిలుపు

Aravind & Vishal copy
Aravind & Vishal

తమిళనాడు రాష్ట్రంలోని ఆర్కే నగర్ ఉపఎన్నికలో స్వంతంత్ర అభ్యర్థిగా బరిలోగి దిగిన నటుడు విశాల్‌కు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నుంచి పిలుపువచ్చింది. ఓ ట్వీట్‌లో విశాల్‌ను కేజ్రీవాల్ ఢిల్లీకి ఆహ్వానించారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం వెనుక తనకు ఆప్ అధినేత కేజ్రీవాల్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్ఫూర్తి అని ఓ ఇంటర్వ్యూలో విశాల్ పేర్కొన్న వార్త కేజ్రీవాల్ దృష్టికి రావడంతో ఆయన క్షణం ఆలస్యం చేయకుండా విశాల్‌కు ఆహ్వానం పలికారు. ‘వెల్కమ్ విశాల్, నీరాక రాజకీయాల్లో మరెందరో యువకులకు స్ఫూర్తినిస్తుందన్నారు. నువ్వు ఢిల్లీకి వచ్చిన్పపుడు మనం కలుద్దాం’ అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.