విభజన చట్టంలోని ఏ హామీని కేంద్రం నెరవేర్చలేదు

Rammohan naidu
Rammohan naidu

న్యూఢిల్లీ: ఎంపి రామ్మోహన్‌ నాయుడు ఈరోజు మీడియాతో మాట్లాడుతు హామీల సాధనకు తమ పోరాటం కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సభలు పెట్టి ప్రజలను మోసం చేయాలని అమిత్‌ షా చూస్తున్నారని ఆయన ఆరోపించారు. విభజన చట్టంలోని ఏ హామీని రైల్వేజోన్‌ ఇవ్వలేదని దయ్యబట్టారు.ఉత్తరాంధ్ర జిల్లాలకు రావాల్సిన రైల్వేజోన్‌ ఇవ్వలేదని, యూనివర్సిటీల కోసం భూములు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. ఒకే కులానికి చెందిన డీఎస్పీలను ఎక్కడ నియమించారో జగన్‌ చెప్పాలని మరో ఎంపీ మురళీమోహన్ ప్రశ్నించారు. చంద్రబాబు నిజాయితీగా సంక్షేమ పథకాలు చేపట్టారని ఆయన అన్నారు.