విపక్షాల నినాదాలతో లోక్‌సభ వాయిదా

loksabha
loksabha

న్యూఢిల్లీ: లోక్‌సభ ప్రారంభమైన తర్వాత కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత స్పీకర్‌ సుమిత్రి మహాజన్‌ ఇటివల మరణించిన మాజీ ఎంపీలకు నివాళి అర్పించారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఆసమయంలో విపక్ష సభ్యులు సభలో నినాదాలతో హోరెత్తించారు. 56 వేల కోట్ల రాఫెల్‌ కుంభకోణంపై జాయ్‌ిం పార్లమెంటరీ కమిటి చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు కోరాయి. ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టాల‌ని భావిస్తున్న డ్యామ్ సేఫ్టీ బిల్లును బీజేడీ వ్య‌తిరేకించింది. అయితే స‌భ్యుల నినాదాలు త‌గ్గ‌క‌పోవ‌డంతో.. స్పీక‌ర్ స‌భ‌ను రేప‌టికి వాయిదా వేశారు.