వినూత్న శైలిలో నిర‌స‌న తెలిపిన భార‌త జ‌వాన్లు

indian jawans
indian jawans

అట్టారిః పాకిస్థాన్‌ సైనికులకు తమదైన శైలిలో నిరసన తెలిపారు బీఎస్ఎఫ్ జవానులు. రిపబ్లిక్ డే సందర్భంగా స్వీట్లు పంచుకోవడానికి నిరాకరించారు. సరిహద్దుల్లో పాక్ తీరుపై ఆగ్రహంగా ఉన్న జవాన్లు.. ఈ విధంగా నిరసన తెలిపారు. ముఖ్యమైన పండుగలు, జాతీయ దినోత్సాల సందర్భంగా బోర్డర్‌లో స్వీట్లు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పాకిస్థాన్ సైనికులకు భారత జవానులు ఇస్తే… వాళ్లు వీళ్లకి ఇస్తారు. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ సంప్రదాయాన్ని శుక్రవారం బ్రేక్ చేశారు బీఎస్ఎఫ్ జవాన్లు. గురువారమే ఈ విషయాన్ని పాక్ రేంజర్లకు తెలిపారు. రిపబ్లిక్ డే రోజున ఎలాంటి కార్యక్రమాలు ఉండవని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించడాన్ని నిరసిస్తూ.. వాళ్లకు ఓ బలమైన సందేశాన్ని ఇచ్చేందుకే ఇలా చేశామన్నారు బీఎస్ఎఫ్ సైనికాధికారి.