వినియోగదారుల రక్షణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

LOKSABHA1
LOKSABHA

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాస్‌ ఈరోజు లోక్‌సభలో కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ-మెయిల్‌ ద్వారా కూడా వినియోగదారుడు తన ఫిర్యాదును నమోదు చేయవచ్చు అని ఆయన తెలిపారు. తన కేసును విచారించేందుకు వినియోగదారుడు లాయర్‌న ఆశ్రయించాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ఈ బిల్లుకు స్టాండింగ్ క‌మిటీ అనుమ‌తి ద‌క్కింద‌న్నారు. ఇది వివాద‌ర‌హిత బిల్లు అని ఆయ‌న తెలిపారు. కృత్రిమ ఉత్ప‌త్తుల‌కు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు చేసే సెల‌బ్రిటీల‌కు శిక్ష ఉండ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వినియోగ‌దారుల ర‌క్ష‌ణ బిల్లు వ‌ల్ల ఫిర్యాదు న‌మోదు చేసే ప్ర‌క్రియ సులువుగా మారింద‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ ప్ర‌తిమా మోండ‌ల్ తెలిపారు.