విద్యుత్‌ నియంత్రిక పేలి… 14 మంది మృత్యువాత

Electric Transformer
Electric Transformer

జైపూర్‌: రాజస్థాన్‌లో జైపూర్‌లో విద్యుత్‌ నియంత్రిక(ట్రాన్స్‌ఫార్మర్‌) పేలి 14 మంది మృతి చెందారు. షాపురా టౌన్‌లో
ఖ‌తులాయ్‌ గ్రామంలో ఈ ఘటన సంభవించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ కుటుబం
వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వివాహ బృందం వీధిలో నడుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు
పక్కనే ఉన్న నియంత్రిక పేలిపోయింది. ఈ ఘటనలో 14 మంది మృత్యువాత పడగా మరో ఏడుగురు గాయపడ్డారు.
క్షతగాత్రులను సమీపంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని
దర్యాప్తు చేపట్టారు. ఘటన గురించి తెలుసుకున్న కేంద్ర మంత్రి జైపూర్‌ రూరల్‌ ఎంపి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ ఘటనాస్థలాన్ని
పరిశీలించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లేఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఘటనపై రాజస్థాన్‌ సీఎం వసుంధరరాజే దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనపై ఉన్నతస్థాయి విచరాణకు ఆదేశించారు. మృతుల
కుటుంబాలకు రూ.10లక్షల నష్టపరిహారం ప్రకటించారు.