విచార‌ణ‌లో ప‌లు అస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించిన హ‌నీప్రీత్!

Gurnmeet singh with adoptes daughter-1
Gurnmeet singh with adoptes daughter

హ‌రియాణాః డేరా బాబా గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ గతవారం అరెస్టయిన సంగ‌తి తెలిసిందే. హనీప్రీత్ ను హరియాణాకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ విచార‌ణ‌లో హ‌నీప్రీత్ ప‌లు అస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన‌ట్లు స‌మాచారం.
సిర్సా ప‌ట్ట‌ణంలో డేరా బాబా ఆశ్రమంలో గుర్మీత్‌కి చెందిన ఓ గుహ ఉంది. దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఆ గుహలోకి గుర్మీత్, హనీప్రీత్ కి తప్పా మరెవ్వరికీ అనుమతి లేదట. ఆ గుహ తలుపులు తన వేలిముద్రలతోనే తెరుచుకుంటాయని సిట్ విచారణలో హనీప్రీత్ బయటపెట్టింది. గుర్మీత్ అరెస్టయ్యాక పంచకులలో అల్లర్లకు పాల్పడేలా చేసింది తానేనని, ఇందుకోసం, కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశానని చెప్పిన‌ట్లు స‌మాచారం.