వారసత్వ ప్రదేశాల్లో ప్రపంచంలో నం-2 తాజ్‌

TAJMAHAL
TAJMAHAL

న్యూఢిల్లీ: ప్రేమకు చిహ్నమైన తాజ్‌ మహల్‌ ప్రపంచంలోనే రెండవ అత్యుత్తమ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎంపి కైంది. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ఈ పాలరాతి కట్టడాన్ని తిలకించేందుకు అమితాస క్తిని కనపరుస్తున్నట్లు ట్రిప్‌ అడ్వైజర్‌ అనే ఆన్‌లైన్‌ పోర్టల్‌ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. షాజహాన్‌ చక్రవర్తి తన భార్య ముంతాజ్‌ స్మార కార్థం నిర్మించిన తాజ్‌మహల్‌ను తిలకించడం కోసం ఏటా 80లక్షల మంది సందర్శకులు వస్తుంటారు. కంబోడియాలోని అంగ్‌కోర్‌ వాట్‌ తర్వాత అత్యధికంగా సందర్శకులు తిలకించాలనుకునేచోటు తాజ్‌మహలేనని ఆ సర్వే పేర్కొంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ఎక్కువ మంది తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు.