వజ్రాలవ్యాపారి హత్యకేసులో వీడని మిస్టరీ!

Devoleena BhattacharjeeDevoleena Bhattacharjee
Devoleena Bhattacharjee

ముంబయి: వజ్రాలవ్యాపారి హత్యకేసుకు సంబంధించి ప్రముఖ టివినటి దేవలిని భట్టాచార్జీని పోలీసులు అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.ముంబయికి చెందిన ఓ వజ్రాలవ్యాపారి మృతితో ఆమెకు కనెక్షన్‌ ఉందని భావించినోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ విషయం హిందీ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. సాథ్‌ నిభానా, సాథియా లాంటి పాపులర్‌ సీరియల్‌లో సైతం ఆమె నటిస్తున్నారు. తెలుగులో కోడలా కోడలా కొడుకు పెళ్లామా అనే సీరియల్‌ వస్తున్న సంగతి తెలిసిందే. రాజేశ్వర్‌ ఉదాని అనే వ్యాపారి అనుమానాస్పద మృతితో పంత్‌నగర్‌ పోలీసులు ఆమెపై అనుమానాలువ్యక్తంచేస్తూ అదుపులోనికి తీసుకుని ఆమెతోపాటు రాజకీయ నాయకుడు సచిన్‌పవార్‌నుసైతంప్రశ్నించారు. పవార్‌ గతంలో బిజెపి నేతగా ఉన్నారు. ఈ ఇద్దరినీ పోలీసులు కొన్ని గంటలపాటుప్రశ్నల వర్షం కురిపించారు. ఈకేసుతో సంబంధం ఉన్న దినేశ్‌ పవార్‌అనే సస్పెండ్‌ అయిన కానిస్టేబుల్‌ను అదుపులోనికి తసీఉకున్న పోలీసులు ఆతడిచ్చిన సమాచారంతో టివినటి దేవోలీనాను అదుపులోనికి తీసుకున్నారు రాజేశ్వర్‌ ఉదాని హత్య అనంతరం పారిపోయిన సచిన్‌పవార్‌ను గౌహతిలోపట్టుకున్నారు. రాజేశ్వర్‌మృతదేహాన్ని మూడురోజులక్రితమే పోలీసులు రా§్‌ుగఢ్‌జిల్లా అడువల్లో రికవరీచేసుకున్నారు. ఈ హత్యకేసులో వారిపాత్ర ఏమిటన్న అంశంపై పోలీసులుపెదవి విప్పడంలేదు. వీరితోపాటువినోదరంగానికిచెందిన మరికొందరుమహిళల హస్తం ఉందని పోలీసుల అనుమానం. 57 ఏళ్ల రాజేశ్వర్‌ ఉదాని నవంబరు 28వ తేదీనుంచి కనిపించడంలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు పోలీసులు మొదట మిస్సింగ్‌కేసుగా నమోదుచేసి పోలీసులు తర్వాత కిడ్నాప్‌ అయినట్లు తేల్చారు. ఆతడివ్రైడర్‌చెప్పిన వివరాలప్రకారం రాజేశ్వర్‌ ఉదాని తనను పంత్‌నగర్‌ మార్కెట్‌ ఏరియాలోడ్రాప్‌చేయమని చెప్పారని, అక్కడినుంచి వేరేవాహనంలో వెళ్లారని పోలీసులు గుర్తించారు. అయితే ఎలాంటి గాయాలులేని రాజేశ్వర్‌ ఉదాని భౌతికకాయం కుళ్లిపోయిన దశలో ఈనెల 5వ తేదీ లభించింది. ఆతడిని గుర్తించడానికి ఎలాంటి ఆధారాలు లేకపోగా రాజేశ్వర్‌కుమారుడు ఆతడు వేసుకున్న దుస్తులు, షూస్‌ ఆధారంగా గుర్తించాడు. ఉదాని కిడ్నాప్‌చేసినవారు ఒక ప్రదేశంలో చంపేసి పాన్‌వెల్‌ అడవిలో మృతదేహాన్ని వదిలివెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఫోన్‌ డేటా తనిఖీచేసిన పోలీసులకు రాజేశ్వర్‌ రెగ్యులర్‌గా కొన్ని బార్లకు వెళ్లేవాడని, గ్లామర్‌, వినోదరంగానికి చెందినమహిళలతో సంబంధాలు ఉండేవని, సచిన్‌పవార్‌ద్వారా ఆతడు వారిని కలిసేవాడని పోలీసులు గుర్తించారు.