వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుంది: టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌

UTTAM KUMAR

హైదరాబాద్‌: 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధిస్తుందని టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
నేడు మహబూబ్‌నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా బాలానగర్‌ మండలంలో పలు
గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ రామచంద్ర కుంతియా
పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఉత్తమ్‌, పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని
రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పత్తికి ఎకరాకు రూ.27వేలు, మొక్కజోన్నకు పదివేలు నష్టపరిహారం ఇవ్వాలని
అన్నారు.