వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీలు

rahul and sonia
rahul and sonia

న్యూఢిల్లీ :సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. 2019 లోక్‌సభ ఎన్నికల కోసం పలు కమిటీలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ శనివారంనాడు ఏర్పాటు చేశారు. 9 మందితో కోర్‌ గ్రూప్‌ కమిటీ, సల్మాన్‌ ఖుర్షీద్‌, శశిథరూర్‌ సహా 19 మంది సభ్యులతో కూడిన మేనిఫెస్టో కమిటీ, 13 మంది సభ్యులతో పబ్లిసిటీ కమిటీని ఆయన ఏర్పాటు చేశారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ ఈ ప్రకటన విడుదల చేశారు.