రెండు రాష్ట్రాలలోనూ బీజేపీ ఆధిక్యత

BJP

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమైంది. ఎగ్జిట్ పోల్స్  అంచనాల మేరకే ఫలితాలు ఉండే అవకాశం ఉందని తొలి ఆధిక్యతలను బట్టి తెలుస్తోంది. రెండు రాష్ట్రాలలోనూ బీజేపీ ఆధిక్యత కనబరుస్తున్నది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు గుజరాత్ లో 93 స్థానాలలో బీజేపీ ఆధిక్యతలో ఉండగా, కాంగ్రెస్ 56 స్థానాలలో ఆధిక్యత కనబరుస్తోంది.  హిమాచల్ ప్రదేశ్ లో 32 స్థానాలలో బీజేపీ ముందంజలో ఉండగా కాంగ్రెస్ పది స్థానాలలో ముందంజలో ఉంది. ఇతరులు ఒక చోట ఆధిక్యంలో ఉన్నారు.