రెండువేల నోట్ల ర‌ద్దు యోచ‌న లేదు

Two thousand
Two thousand

న్యూఢిల్లీః కొత్తగా ప్రవేశపెట్టిన 2000 నోట్లను రద్దు చేసే యోచ‌న లేదని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. నోట్ల రద్దు తర్వాత 2016, నవంబర్‌లో ఈ 2000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2000 నోటును రద్దు చేసే ప్రతిపాదన ఏదీ లేదు అని ఆర్థికశాఖ సహాయమంత్రి రాధాక్రిష్ణన్ లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో స్పష్టంచేశారు. ఇక ఈ రూ.500, రూ.2000 నోట్ల సైజు 66 ఎంఎం X 150 ఎంఎం, 66 ఎంఎం X166 ఎంఎంగా ఉందని ఆయన తెలిపారు. రెండు నోట్ల సైజుల్లో పది మిల్లీమీటర్ల తేడా ఉన్నందును సునాయాసంగా గుర్తించవచ్చని రాధాక్రిష్ణన్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇక రూ.10 ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి ఇప్పటికే క్షేత్రస్థాయిలో ట్రయల్స్ నిర్వహించాలని నిర్ణయించినట్లు కూడా ఆయన తెలిపారు. దీనికోసం ఐదు ప్రాంతాలను ఇప్పటికే ఎంపిక చేసినట్లు చెప్పారు. కొచ్చి, మైసూర్, జైపూర్, షిమ్లా, భువనేశ్వర్‌లలో ప్లాస్టిక్ పది నోట్లు ట్రయల్ చేస్తామని ఆయన అన్నారు.