రెండాకులను సొంతం చేసుకుంటాను: దినకరన్‌

TTV. Dinakaran
TTV. Dinakaran

చెన్నై: తమిళనాడులోని ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ డిసెంబరు 21న నిర్వహించనున్నారు. రెండాకుల గుర్తు కోసం తమకు కావాలంటే తమకు కావాలని పళనిస్వామి వర్గం, దినకరన్‌ వర్గం పోటీపడ్డాయి. చివరికి ఆ గుర్తును పళనిస్వామి వర్గానికే కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దినకరన్‌ ఓ ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజు తిర్పూర్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో దినకరన్‌ రెండాకుల గుర్తును ఎలాగైనా సొంతం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలో తాను విజయం సాధిస్తానని అన్నారు.