రూ.3వేల కోట్ల సమీకరణలో ఎయిర్‌టెల్‌

AIRTEL-1
AIRTEL

రూ.3వేల కోట్ల సమీకరణలో ఎయిర్‌టెల్‌

న్యూఢిల్లీ, మార్చి 11: భారతి ఎయిర్‌టెల్‌ నిధుల సమీకరణకుగాను ఎన్‌సిడిలు జారీచేస్తోంది. మూ డువేల కోట్ల రూపాయలు ప్రైవేటు ప్లేస్‌మెంట్‌ విధానంలో ఎన్‌సిడిలు జారీచేసి నిధులు సమీకరిం చాలని నిర్ణయించింది. స్టాక్‌ ఎక్ఛేంజిలకు కంపెనీ ఈ వివరాలు అందచేసింది. డైరెక్టర్ల బోర్డు కమిటీ ఈనెల 13వ తేదీ సమావేశం అయి వీటిపై చర్చి స్తుందని వెల్లడించింది. బిజినెస్‌ విస్తరణకుగాను కంపెనీ ఎన్‌సిడిల జారీకి ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఇవి మంజైరయిన వెంటనే సాంప్రదాయంగానే ట్రెజరీ కార్యకలాపాలు ప్రారం భిస్తుంది. రుణభారం, స్పెక్ట్రమ్‌ బకాయిల చెల్లిం పులకు వీటిని వినియోగిస్తుందని భారతి ఎయిర్‌ టెల్‌ వెల్లడించింది.

కంపెనీ నిధుల ప్రణాళికను మరింత పటిష్టంచేసేందుకు జియో నుంచి ఎదు రవుతున్న పోటీని ఎదుర్కొనేందుకు వీలుగా పటి ష్టంచేస్తుందని అంచనా. టెలికాం రంగంలో రుణ భారంతో ఉన్న సంస్థలు జియో వచ్చిన తర్వాత మరింతగా ధరలయుధ్దానికి తెరలేపాయి. దీనితో రాబడులు మరింత తగ్గిపోయాయి. ఆఫ్రికా యూ నిట్‌కు ఐపిఒజారీచేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

రుణభారం తగ్గించేందుకు మరిన్ని ప్రణాళికలు అమలుచేస్తామని వెల్లడించింది. ఇటీవలే ఎయిర్‌టెల్‌ సింగపూర్‌ టెలికమ్యూ నికేషన్స్‌నుంచి రూ.2649 కోట్లు భారతి టెలికాం లో వాటాలు కొనుగోలుచేసింది. ప్రాధాన్యతా కేటా యింపు విధానంలో ఈ పెట్టు బడులు పెట్టింది. ఈ సొమ్మును రుణభారం తగ్గించేందుకే విని యోగిస్తోంది. ఎయిర్‌టెల్‌ 20శాతం డిటిహెచ్‌, భారతి టెలిమీడియా సంస్థల వాటాలను విక్రయి స్తుందని వెల్లడించింది. వార్‌బర్గ్‌ పిన్‌కస్‌కు 350 మిలియన్‌ డాలర్లకు విక్రయిస్తున్నది. భారతి ఇన్‌ప్రాటెల్‌లో కొంత వాటా నుసైతం విక్రయిం చింది. భారతి ఎయిర్‌టెల్‌, అనుబంధ సంస్థలు మొత్తంగా టవర్‌ బిజినెస్‌ విభాగంలో 53.51 శాతంగా ఉన్నాయి. ఐడియా సెల్యులర్‌ కూడా నిధుల సమీకరణప్రనాళికను ప్రకటించింది.