రాహుల్‌ సమావేశమైన చంద్రబాబు

Chandrababu ,rahul
Chandrababu ,rahul

న్యూఢిల్లీ: ఏపి సిఎం చంద్రబాబు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు.ఏపీ భవన్‌ నుంచి రాహుల్‌ నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈనెల 19న తుదివిడత పోలింగ్‌ ముగియనుండటంతో ఎన్డీఏకు ఎన్నిసీట్లు వచ్చే అవకాశముంది, యూపీఏకు ఎన్ని సీట్లు వస్తాయి, మే 23 తర్వాత అనుసరించాల్సిన కార్యచరణ.. తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. రాహుల్‌గాంధీతో భేటీ తర్వాత శరద్‌పవార్‌, శరద్‌యాదవ్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈరోజు ఉదయం ఏపీ భవన్‌లో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజాతో సమావేశమై మే 23 ఎన్నికల ఫలితాల అనంతరం భవిష్యత్‌ కార్యచరణపై చర్చించినట్లు తెలుస్తోంది.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/