రాహుల్‌ పై వ్యాఖ్యలపై మండిపడ్డ నిర్మలా

nirmala sitharaman, rahul gandhi
nirmala sitharaman, rahul gandhi

న్యూడిల్లీ: రాఫెల్ హెచ్ఏఎల్ హక్కు అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. అంత ప్రేమ ఉంటే అగస్టా హెలీకాఫ్టర్ల కాంట్రాక్టు హెచ్ఏఎల్‌కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అలా ఇచ్చి ఉంటే హెలీకాఫ్టర్లు మాత్రమే వచ్చేవని, ముడుపులు వచ్చిఉండేవి కావని కాంగ్రెస్‌కు చురకలేశారు. కాంగ్రెస్ నేతలు చెప్పేవన్నీ అబద్దాలని నిర్మల మండిపడ్డారు. తాను అన్నాడీఎంకే సభ్యుల వెనుక దాగున్నానని విమర్శించిన కాంగ్రెస్ నేతలకు ఇవాళ తాను సమాధానం చెబుతుంటే వినే ధైర్యంలేదని నిప్పులు చెరిగారు.