రాహుల్‌ అబద్దాల కోరు: రవిశంకర్‌ ప్రసాద్‌

Ravi shankara prasad
Ravi shankara prasad

న్యూఢిల్లీ: అబద్దాల కోరు, బాధ్యతారహితుడైన రాహుల్‌ వంటి వ్యక్తి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కావడం ఈ పార్టీకి సిగ్గుచేటంటూ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఈరోజు మండిపడ్డారు. అసలు తమాషా ఇప్పుడే మొదలైంది. అంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యాలపై ఆయన విమర్శించారు. బోఫోర్స్‌ కావచ్చు నేషల్‌ హెరాల్డ్‌ కావచ్చు ఇలా స్కాముల్లో కూరుకుపోయిన ఓ కుటుంబానికి చెందిన నేత నుండి ఇంతకంటే ఏమి ఆశించగలం? అని ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశ చరిత్రలో ఒక ప్రధాని గురించి ఏ జాతీయ పార్టీ అధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు అని ఆయన అన్నారు.