రానున్నసార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఉండదన్న కేజ్రీవాల్‌

Arvind kejriwal
Arvind kejriwal

న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో న్యూఢిల్లీలో బిజెపికి తమ పార్టీకి మధ్య పోటి ఉంటుందని న్యూఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం ట్విట్‌ చేశారు. కాగ్రెస్‌కు కేవలం తొమ్మిది శాతం ఓట్లే పోలవుతాయని ఆయన అన్నారు. న్యూఢిల్లీ నుంచి ఏడుగురు ఎంపీలు ఆప్‌కు చెందినవారైతే న్యూఢిల్లీ మెట్రో చార్జీలు పెరిగిఉండేవి కవని ప్రజలు భావిస్తున్నారుని కేజ్రీవాల్‌ అన్నారు. ప్రజల హక్కుల కోసం తమ పార్టీ మాత్రమే పోరాడుతోందని ప్రజలు గమనిస్తున్నారని ఆయన చేప్పుకొచ్చారు.