రాజస్తాన్‌లో మళ్లీ బిజెపిదే అధికారం

PRAKASH JAVADEKAR
PRAKASH JAVADEKAR

న్యూఢిల్లీ: రాజస్తాన్‌ శాసనసభ కు ఎన్నికలు జరుగుచున్న విషయం విదితమే. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మాట్లాడుతూ తమ పార్టీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే తిరిగి తమకు అధికారం కట్టబెడతాయని, ఈ సంక్షేమ పథకాల్లో లబ్ది పొందిన లబ్దిదారులే తమ పార్టీ ప్రచారకర్తలు అని ఆయన అన్నారు.కాగా రాజస్తాన్‌ లో డిశంబరు ఏడు న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తిరిగి రాZషంలో అధికారం లోకి రావడానికి బిజెపి పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు మహాకూటమి రూపంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనుండటం అధికార బిజెపి ముప్పు పొంచి ఉంది. అయితే త్వరలో నూతన జాతీయ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడానికి మానవ అభివృద్ది శాఖ ప్రయత్నాలు చేస్తుందని ఆ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు.కాగా ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాZషాలలోని జరుగుతున్న ఎన్నికలలో వ్యతిరేక పవనాలు వీస్తున్న రాజస్తాన్‌ లో ఏ విధంగా ఎన్నికలను ఎదుర్కోనున్నారని జవదేకర్‌ ను పాత్రికేయులు అడుగగా ఆయన సమాధానమిస్తూ రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీ లేదని.ప్రతిపక్ష నాయకుడు అశోక్‌ గెహ్లాట్‌ అసెంబ్లీ కి ఎన్నడూ హాజరు కాలేదని,ఈ నేపథ్యంలో బిజెపి మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అంతేగాక గత 20 సంవత్సరాల నుంచి రాజస్తాన్‌ లో ఒక సారి కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే, మరొక సారి బిజెపి గెలుస్తోందని అయితే ఈ సారి మళ్లీ బిజెపి యే గెలిచి గత రికార్డును చెరిపేస్తుందని బలంగా నమ్ముతున్నామన్నారు. తాము చేసిన మంచి పనులు ప్రజలకు చేరుతున్నాయని, ఖచ్చితంగా అధికరాంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.కాగా జవదేకర్‌ మాట్లాడుతూ రాZషంలో తాను 2-4 తేదీలలో పర్యటించానని ఈ సందర్భంగా తాను దళితులు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలలో పర్యటించానని, ప్రభుత్వ విద్యాసంస్థలు అభివృద్ది చెందాయని, చిన్న మార్గాలలో కూడ రోడ్డు సౌకర్యం చాల బాగుందని, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారని,ఈ ప్రజలే తమ పార్టీ ప్రచారకర్తలు అని ఆయన పేర్కొన్నారు.తన పర్యటనలో భాగంగా రెండవరోజు ఒక దళిత కుటుంబం నివసిస్తున్న ఇంటికి భోజనానికి వెళ్లానన్నారు. ఆ ఇంట్లో కేంద్రం ప్రవేశ పెట్టిన ఉజ్వల పథకం కింద ఉచితంగా సరఫరా చేసిన గ్యాస్‌స్టవ్‌, పి.ఎం.అవాస్‌ యోజన కింద ఇంటికి సంబంధించిన పట్టా,ఒక మరుగుదొడ్డి సౌకర్యం ఉందన్నారు. అంతే గాక వృద్ధాప్య పించను కింద ఆ ఇంట్లో ఒక వ్యక్తికి రూ.1000 వస్తాయని, ఒక వ్యక్తికి కేవలం వంద రూపాయలకే మొబైల్‌ ఫోన్‌ ఇచ్చారని, దీంతో ఆ కుటుంబం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మూడవ రోజు తక్కువ ధరలో ఆహారాన్ని అందించే అన్నపూర్ణ రసోయి యోజనను సందర్శించానని అక్కడ ఐదు రూపాయలకు అల్పాహారం, ఎనిమిది రూపాయలకు ఫుల్‌ మీల్‌ పెడతారన్నారు.అయితే తమ పార్టీ మాటలు చెప్పదని, చేతల్లో చూయిస్తుందని అందుకే మరొక్క సారి బిజెపి ప్రభుత్వమేని తమ పార్టీ నినాదమన్నారు.గతంలో రాజస్తాన్‌ లోని జాట్లు, రాజ్‌పుత్‌ ల వంటి సామాజిక గ్రూపులు బిజెపి కి మద్దతునిచ్చాయని, ప్రస్తుతం ఆ వర్గాలు నిరాశాజనకంగా ఉన్నాయని పాత్రికేయులు ఆయనను అడిగారు.దీనికి జవదేకర్‌ సమాధానమిస్తూ తాము ఏ గ్రూప్‌ ను ఓటు బ్యాంకుగా పరిగణించలేదని, కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు తాము చేయలేమన్నారు. తాము ప్రతి పేదవాడికి గౌరవంగా బ్రతికే నమ్మకాన్ని కలిగిస్తున్నామని, మంచి విద్య, ఆరోగ్య భద్రతను కల్పిస్తున్నామన్నారు. గతంలో ఇందిరాగాంధీ పాలన వైపు మొగ్గు చూపిన పేదలందరూ 2014 నుంచే ప్రధాని మోదీ వైపు మొగ్గు చూపారన్నారు.రాజస్తాన్‌ లో భామాషా పథకం కింద రెండున్నర మిలియన్ల రోగులు లబ్ది పొందారని, అదేవిధంగా రాజస్తాన్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి జల్‌ స్వావలంబన్‌ అభియాన్‌ పథకం కింద ప్రతి జిల్లాలో ఐదు ఫీట్ల నుంచి 20 ఫీట్ల వరకు నీటి పథకాన్ని వృద్ధి చేశామని తెలిపారు. ఈ విధంగా కేంద్ర, రాZష పథకాలు ప్రజలను అభివృధ్ది దిశలో నడిపిస్తున్నాయన్నారు.అయితే జాట్లకు ఒబిసి కోటా కింద అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించామన్నారు. రాజ్‌పుత్‌ లను తగిన గౌరవాన్ని ఇస్తున్నామని సమాజంలో అన్ని వర్గాలను సమానంగా చూస్తామని, తాము కుల రాజకీయాలు చేయమని, ఈ సమస్య కాంగ్రెస్‌ పార్టీలో ఎక్కువుందని తెలిపారు.