యువ మహిళా జర్నలిస్టులను కవరేజికి పంపొద్దు

SABARIMALA
SABARIMALA

శబరిమలకర్మసమితి మీడియా సంస్థలకు లేఖలు
తిరువనంతపురం: యువమహిళా జర్నిలిస్టులను శబరిమల కవరేజికోసం పంపించవద్దని హిందూత్వ సంస్థలు మీడియా యాజమాన్యాలకు విజ్ఞప్తిచేసాయి. శబరిమల కర్మసమితి ఈమేరకు అన్ని మీడియా సంస్థల యాజమాన్యాలకు విజ్ఞప్తిచేసింది. శబరిమల ఆలయాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని గౌరవించి యువ మహిళా జర్నలిస్టులను పంపించవద్దని కోరింది. సోమవారం ప్రత్యేక పూజలకోసం అయ్యప్ప దేవాలయాన్ని తిరిగి ప్రారంభిస్తున్నారు. శబరిమల కర్మసమితిలో విశ్వహిందూపరిషత్‌, హిందై ఐక్యవేది వంటి సంఘాలు ఉన్నాయి.గత సెప్టెంబరులోనేసుప్రీంకోర్టు పది నుంచి 50 మధ్యలో ఉన్నమహిళలపై ఉన్న నిషేధం రాజ్యాంగ విరుద్ధమని వారిని కూడా అనుమతించాలని తీర్పు వెల్లడించిననేపథ్యంలో భారీ ఎత్తుననిరసనలు మిన్నంటాయి. అయ్యప్ప అందోళనల్లో ఒక భక్తుడుసైతం మృతిచెందాడు. ఈ నేపథ్యంలో ఆలయం సోమవారం ప్రత్యేకపూజలకోసం తెరుస్తున్నందున కేరళలోని వామపక్ష పినరయి విజయన్‌ ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటుచేసింది. ఆలయానికి వచ్చే ప్రతి భక్తుణ్ణి క్షుణ్ణంగా సోదాచేసి మరీ పంపించాలనినిర్ణయించింది. రెండోసారి పూజలకోసం తెరుస్తున్న దేవాలయంలో ఎట్టిపరిస్థితుల్లోను 10-50మధ్య ఉన్న మహిళలను అనుమతించేదిలేదని ఎస్‌కెఎస్‌ వెల్లడించింది. అయ్యప్ప ఆజన్మబ్రహ్మచారి అయినందున రుతుక్రమం వచ్చే మహిళల వస్తే అయ్యప్ప దీక్షలకు భంగం కలుగుతుందని, దేవాలయ పవిత్రత దెబ్బతింటుందని, శతాబ్దాలతరబడి వచ్చే సాంప్రదాయాన్ని కొనసాగించాలని అటు ఆలయపాలకవర్గం,ప్రధాన పూజారులు పెద్దలుమొత్తం పట్టుదలతో ఉనానరు. నిరసనకారులు హిందూ మతతత్వ వాదులు ఈ సందర్భంగా శబరిమలకు వచ్చే దారులన్నింటినీ తమ అధీనంలోనికి తీసుకున్నారు. సంపాదకులకు రాసిన లేఖ కాపీలను మీడియాకు విడుదలచేసింది. ఈవయసుల్లోని మహిళా జర్నలిస్టులనుసైతం అడ్డుకుంటామని, సమస్య తీవ్రతరం కాకుండా యాజమాన్యాలు ముందస్తుచర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమస్యపై మీడియా మద్దతు మాకు సంతోషమేనని, ఆందోళనను మరింతముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా 10-50లోపున్న మహిళా జర్నలిస్టులనుకవరేజికోసం పంపించవద్దని వెల్లడించారు. సోమవారం ఉదయమే దేవాలయాన్ని పూజకోసం ప్రారంబిస్తారు. ఛితిర అట్టవిశేషం సందర్భంగా మంగళవారం కూడా పూజలు చేస్తారు. ట్రావన్‌కూర్‌ రాజు ఛిథిరతిరున్‌ బలరామ వర్మ జన్మదినం సందర్భంగా ఈప్రత్యేక పూజలు జరుగుతాయి. మంగళవారం ఉదయం పది గంటలకు దేవాలయాన్ని మూసివేస్తారు. తిరిగి ఈనెల 17వ తేదీ దర్శనం కోసం తిరిగి తెరుస్తారు. సుప్రీంకోర్టు దాఖలయిన రివ్యూ పిటిషన్లను విచారించేందుకు అంగీకరించినప్పటికీ రాష్ట్రప్రభుత్వం కావాలనే ఉద్యమాన్ని నిర్లక్ష్యంచేస్తోందని, తీర్పును అమలుచేసే నిర్ణయంతో అనవసర చర్యలు ఉద్రిక్తతలనురెచ్చగొడుతున్నదని ఆరోపించారు.