యువతరం ఓట్లకోసం ఎంపి బిజెపి ‘మీట్‌యువర్‌సీఎం!

Shivraj singh chouhan
Shivraj singh chouhan

భోపాల్‌: వచ్చే ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకర్షించేందుకు బిజెపి కొత్తకొత్త ఎత్తుగడలు వేస్తోంది.మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు యువతనుసమాయత్తంచేసేందుకు వారిని పార్టీకి చేరువచేసేందుకుగాను కాఫీ విత్‌ శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కార్యక్రమాన్నిచేపట్టింది. మొత్తం 80 లక్షలమందివరకూ మొదటిసారి ఓటర్లు నమోదయ్యారు. ఈ ఏడాదిఫిబ్రవరిలోనే యువకులకు ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌ సంయుక్తంగా పోటీలు నిర్వహించామని, విజేతలకు కాఫీవిత్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఏర్పాటుచేసినట్లు ఎంపిబిజెపి ప్రధాన కార్యదర్శి విడిశర్మ వెల్లడించారు. మొత్తం మూడుబ్యాచ్‌లుగా 56 మంది యువకులకు ఈ సౌకర్యం కల్పించామని, యువ తరంలో ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బిజెపి ఆధ్వర్యంలో ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఈ ఏకైక పోటీని నిర్వహించాయి. కనీసం 30 లక్షల యువమొదటిసారి ఓటర్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వివిధ అభివృద్ధిపథకాలపై అవగాహణ, బిజెపి భ్రుత్వం గడచిన 15ఏళ్లుగా తీసుకువచ్చిన పరివర్తన వంటి అంశాలపై ఈ పోటీలు జరిగాయి. మధ్యప్రదేశ్‌ దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న బీమారు కేటగిరినుంచి బైటపడింది. ఇందుకోసం యువకులను గతంలోజరిగిన చేదు అనుభవాలనుంచి బైటికి తెచ్చేప్రయత్నంచేస్తోంది. బుక్‌లెట్లు, ఇతర సాహిత్యం వంటివాటిని వివిధ పథకాలపై ఇప్పటికే పంపిణీచేసామని, బిజెపి ప్రభుత్వం ఇప్పటికే భారీ ఎత్తున ఈ పథకాలప్రచారంచేస్తున్నదని విడిశర్మ వివరించారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోచేపట్టిన అభివృద్ధిపథకాలపై సమీక్షచేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా సిట్టింగ్‌ ఎంపి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్‌ సింగ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకులు తాముచేసిన పనికి ఎంతో గొప్పలుచెప్పుకుంటారని, 2003ఎన్నికలకుముందునాటిరోజులను వారికి గుర్తుచేస్తున్నామని అన్నారు. మధ్యప్రదే9శ్‌లో ఆనాడు రోడ్లుసైతం సక్రమంగా లేవని, కేవలం ఏడు లక్షల హెక్టార్ల భూమికి మాత్రమే సాగునీటివసతి ఉందని అన్నారు. ఇపుడు రాష్ట్ర హైవేలున్నాయని, 40 లక్షల హెక్టార్లభూమికి సాగునీటివసతి ఉన్నదని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను యువతరానికి సైతం అవగాహన రావాలని అందుకోసమే ఈపోటీలు నిర్వహించి విజేతలకు మీట్‌యువర్‌సిఎంను ఏర్పాటుచేసామన్నారు. గడచిన 15ఏళ్లుగా బిజెపి మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉంది. ఈసారి ఎన్నికలకు కాంగ్రెస్‌పార్టీనుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నది. ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేకతకూడా ఎక్కువగా ఉందని పరిశీలకుల అంచనా. అలాగే రైతాంగంలో ఎక్కువ అసహనం అలజడి అధికార ప్రభుత్వంపై గూడుకట్టుకుని ఉంది. వీటికితోడు నిరుద్యోగం కూడా యువతను ప్రభుత్వ వ్యతిరేకతకు పురిగొల్పింది. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ బిజెపి హయాంలో వ్యాపం అవినీతి కుంభకోణం వంటి కేసుల్లో కొంత అప్రతిష్టను మూటగట్టుకున్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పంకజ్‌చతుర్వేది మాట్లాడుతూ బిజెపి ఆపార్టీ ముఖ్యమంత్రి ప్రతిష్ట పూర్తిగా దెబ్బతిన్నదని, పనిచేసే మామాజీ అన్న ప్రతిష్టను కోల్పోయారని, ఆయన ఎప్పటికీ సమర్ధుడైనముఖ్యమంత్రి కాలేరని ఎద్దేవాచేసారు. బిజెపికిసైతం ఈసారి ఎన్నికల్లో గట్టిపోటీని, సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందనిముందుగానే గ్రహించింది. బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర యూనిట్‌ బిజెపి చీఫ్‌ను మార్చి నందకుమార్‌చౌహాన్‌స్థానంలో లోక్‌సభ ఎంపి రాకేష్‌సింగ్‌ణు నియమించారు. కేంద్రమంత్ర ఇనరేంద్రసింగ్‌ తోమర్‌ ఆధ్వర్యంలో ఒక ప్రచారకమిటీని సైతం నియమించారు. 2008, 2013 సంవత్సరాల్లో ఆయన ఎంపి బిజెపి అధ్యక్షునిగాసైతం పనిచేసారు. శివరాజ్‌సింగ్‌చౌహాన్‌ ఒకప్పుడు ఉమాభారతి విధేయుడిగా కొనసాగారు. తదనంతరం ఆమెతో అభిప్రాయబేధాలొచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు కొత్త రాష్ట్రయూనిట్‌ చీఫ్‌ రాకేష్‌ సింగ్‌; కేంద్రమంత్ర ఇనరేంద్రసింగ్‌ తోమర్‌లు సమీక్షచేస్తున్నారు. 50శాతం మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే టికెట్లు తిరస్కరించే అవకాశం ఉందని అంచనావేసారు. అయితే బిజెపి ఎన్నికల వ్యూహకర్తలు మాత్రం టికెట్లు తిరస్కరించి సమర్దులైన నాయకులకివ్వడంతోనే ఎంపిలో అధికారంలోనికి రాగలమా అన్న వ్యూహంపై అంతగా ధీమా వ్యక్తంచేయలేకపోతున్నారు.