యుపి అల్లర్ల కీలక నిందితుడు

army jawan
army jawan

ఆర్మీ జవాను అరెస్టు
బులంద్‌షహర్‌(యుపి): బులంద్‌షహర్‌ అల్లర్లలో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ హత్యకు కీలక నిందితునిగా భావిస్తున్న ఆర్మీజవానును సైనికాధికారులు ఉత్తరప్రదేశ్‌పోలీస్‌లకు అప్పగించారు.అప్పటి ఫోటోల్లో భజరంగ్‌దళ్‌కు చెందినయోగేష్‌ రాజ్‌ పక్కనే ఈ ఆర్మీజవాను ఉన్నట్లు తేలింది. యుపిపోలీసులు ఆతణ్ణి అర్ధరాత్రి అరెస్టుచేసినట్లు తెలిపారు. జెట్టు ఫౌజీగా పిలిచేజితేంద్రమాలిక్‌ను సైన్యం పోలీసులకు అప్పగించింది. ప్రాథమిక విచారణపూర్తిచేసామని, ఆయన్ను బులంద్‌షహర్‌కు తీసుకుని వచ్చామని, కోర్టుకు హాజరుపరిచి జ్యుడిషియల్‌కస్టడీకి కోరతామని సీనియర్‌ అధికారి అభిషేక్‌ సింగ్‌ మీరట్‌లోవెల్లడించారు. శ్రీనగర్‌కు మాలిక్‌ను పోస్టింగ్‌ఇచ్చారు. రాష్ట్రీయ రైఫిల్స్‌లో ఆయనపనిచేస్తున్నాడు. 15రోజులు సెలవుపై వచ్చాడు. బులంద్‌షహర్‌లో అల్లర్లు జరిగినరోజునఅనేక వీడియోల్లో ఆతడు కనిపించాడు. ఈ ఫోటోల్లో భజరంగ్‌దళ్‌కు చెందినయోగేష్‌రాజ్‌పక్కనేనిలుచున్నట్లు కనిపించాడు. ఇనస్పెక్టర్‌ సింగ్‌ ఆతనిబృందం ఈ గ్రామానికి అల్లర్లను అదుపుచేసేందుకు వెళ్లింది. ఆయనపై గడచిన సోమవారం భారీఎత్తున మూకదాడి జరిగింది. సింగ్‌ను పదునైన ఆయుధంతో దాడిచేసారు. అనంతరం ఆతణ్ణి కాల్చి చంపినట్లుతేలింది. శనివారం టాప్‌పోలీస్‌అధికారి బులంద్‌షహర్‌లో పనిచేస్తున్న సీనియర్‌ మరో ఇద్దరు అధికారులను నిర్లక్ష్యం వహించినందుకు బదిలీచేసారు. అక్కడ గోవధ జరుగుతున్నదన్న వార్తలు వెలువడినతర్వాతకూడా స్పందించకపోవడంపై వీరి బాధ్యతారాహిత్యం ఉందని బదిలీచేసినట్లు డిజిపి వెల్లడించారు.