మోడీ బాగ్‌పట్‌ ప్రచారంపై ప్రతిపక్షం ఫిర్యాదు

PMMODI
Narendra Mody

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో మరో 24 గంటల్లో కైరానా ఉప ఎన్నికకు పోలింగ్‌ జరుగుతున్న నేపథ్యంలోప్రధాని నరేంద్రమోడీ పక్కనే ఉన్న భాగ్‌పట్‌లో తూర్పు సరిహద్దు ఎక్స్‌ప్రెస్‌వేనుప్రారంభించడం, ప్రసంగంలో చెరకురైతుల సమస్యలు, దళిత సమస్యలపై ప్రసంగించడం ఎన్నికల ప్రచారంచేసినట్లుగానే ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కైరానాలో ముఖ్యమంత్రియోగి ఆదిత్యనాధ్‌ విస్తృతప్రచారంచేసి మరో ఐదుగురు రాష్ట్రమంత్రులను నియమించారు. డిప్యూటి సీఎం కేశవ్‌ప్రసాద్‌మౌర్యనుసైతం బాద్యతలు ఇచ్చారు. అయితే మోడీ చేసిన ప్రారంభోత్సవం కాలం, చేసినప్రసంగం తీరుతెన్నులుచూస్తే ఎన్నికల ప్రసంగంగా ఉందని ప్రతిపక్ష పార్టీలూ రోపిస్తున్నాయి. భాగ్‌పట్‌ పిఎంమోడీ పర్యటన కైరానకు అతిచేరువలోనే ఉంది.ఆయన ప్రసంగంతో ఈ ఉప ఎన్నిక ప్రాంతంలో ప్రభావం ఉంటుందని అంచని అంచనా. చెరకురైతుల బకాయిలు ఈప్రాంతంలో రైతులనుంచి వస్తున్న ప్రధాన సమస్య. ప్రధానిమోడీ భాగ్‌ఖపట్‌లో పర్యటన ఎన్నికలను ప్రభావితంచేస్తుందని అంచనా. ప్రతిపక్షం ఇప్పటికే మోడీపర్యటన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లయిందని ఫిర్యాదుచేసింది. చెరకు రైతులకు 5.50 రూపాయలు క్వింటాలకు అదనపు లబ్దిపొందుతున్నారు. రైతుల సొమ్ము మిల్లులయజమానులవద్దఎట్టిపరిస్థితుల్లోను చిక్కుకోకూడదని, చెరకు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పిఎం మోడీ వెల్లడించారు. ఐదుకోట్ల మంది చెరకురైతులకు లబ్దిచేకూరుస్తామని అన్నారు. యుపిఎ హయాంలో చేపట్టిన పథకాలను కాపీకొడుతూ చెరకురైతులపై కల్లబొల్లిప్రేమ ఒలకబోస్తున్నారని కాంగ్రెస్‌ తన ట్విట్టర్‌లో ఇప్పటికే విమర్శించింది. బకాయిలుసాధించుకునేందుకు ఈప్రాంతంలో ఉద§్‌ువీర్‌ వంటిరైతులు ప్రాణత్యాగంతోనే ఎన్‌డిఎ ప్రభుత్వంలో కదలిక వచ్చిందని పేర్కొంది. 58 ఏళ్ల ఉద§్‌ువీర్‌ వారంరోజులపాటు నిరసనదీక్షను చేపట్టారు. చెరకుమిల్లులుచెల్లించాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని పట్టుబడుతూ నేలకొరిగారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ యుపిలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయి, రౌడీలు, నేరగాళ్లు వారంతటవారే లొంగిపోతున్నారని పేర్కొన్నారు. కైరానా ఉప ఎన్నిక ప్రతిపక్షానికి విషమపరీక్షగా ఉంది. బిజెపి మృగాంకసింగ్‌కు మంచి మద్దతు లభిస్తోంది. ఇక ఆర్‌ఎల్‌డి అభ్యర్ధి తబస్సుమ్‌ హసన్‌ పోటీకి దిగారు. కాంగ్రెస్‌; ఎస్‌పి, బిఎస్‌పి పార్టీలుసైతం తబుస్సుమ్‌కు మద్దతిస్తున్నాయి. అయితే ఎటొచ్చీ ఉప ఎన్నిక నియమావళి అమలవుతున్న తరుణంలో పక్కనే ఉన్న బాగ్‌పట్‌కు వచ్చిన ప్రధానమంత్రి ఎన్నికలను ప్రభావితంచేసే అంశాలను ప్రస్తావించడంపై కాంగ్రెస్‌ ఇతర ప్రతిపక్షాలుమండిపడుతున్నాయి.