మోడీ నివాసం వద్ద టీడీపీ ఎంపీలు ఆందోళన

TDP MPs
TDP MPs

విభజన హామీలు, ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ఢిల్లిలో ఆందోళన కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్రధాని ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన టీడీపీ ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రధాని నివాసం వద్దే ఎంపీలు బైఠాయించారు. ఏపీకి న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహిస్తున్నారు.