మోడిపై క్రేజివాల్‌ విమర్శలు

Kejrival
Kejrival

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్‌ క్రేజీవాల్‌ నగరంలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 11వేల కొత్త తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు మోడిపై విమర్శలు చేశారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రచారాన్ని ప్రారంభించారు.ఒకవేళ మీ పిల్లలపై మీకు ప్రేమ ఉంటే, మీ చిన్నారుల కోసం ఎవరు పనిచేస్తున్నారో.. వారికి ఓటెయ్యండి. పిల్లలపై ప్రేమ లేకపోతే, వెళ్లి మోడి కి ఓటెయ్యండి. మోడి జీ ఒక్క తరగతి గది గానీ ఒక్క పాఠశాల గానీ నిర్మించలేదు. దేశం పట్ల ప్రేమ ఉందా.. లేదా మోడి  పట్ల ప్రేమ ఉందా మీరే నిర్ణయించుకోవాలిగ అని కేజ్రీవాల్‌ వెల్లడించారు.