మేము కాదు కుమారస్వామియే ప్రలోభ పెడుతున్నారు

YEDDYURAPPA
YEDDYURAPPA

బెంగళూరు: కర్ణాటక సిఎం కుమారస్వామి బిజెపి పార్టీ ఎమ్మెల్యెలకు డబ్బు, మంత్రి పదవులు ఇస్తాన్నాంటు ప్రలోభ పెడుతున్నారని ఆరాష్ట్ర మాజీ సిఎం యడ్యూరప్ప ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి భాజపా ప్రయత్నిస్తోందని, తమ ఎమ్మెల్యేలతో బేరసారాలాడుతోందని కాంగ్రెస్‌ జేడీఎస్‌ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈవిషయంపై  స్పందించిన యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ… మేము వారిని ఎటువంటి ప్రలోభాలకు గురి చేయట్లేదు. కుమారస్వామియే బేరసారాలాడుతున్నారు. మా ఎమ్మెల్యేలకు డబ్బు, మంత్రి పదవులు ఇస్తామని ఆశ పెడుతున్నారు ఆయన అన్నారు.