మృగాడి చెర నుంచి బాత్రూమ్‌లో యువతి

Sexual abuse
Sexual abuse

పుణె నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న రైలులో ఓ కానిస్టేబుల్‌ బారి నుంచి తనను తాను కాపాడుకునేందుకు ఓ యువతి వాష్‌రూమ్‌లో వెళ్లి, 3గంటల పాటు అక్కడే బిక్కుబిక్కుమంటూ నరకయాతన పడింది. మరిన్ని వివరాలు శనివారం కామర్స్‌ విద్యను చదువుతున్న యువతి(21) దురంతో రైల్‌ ఎక్కింది. ఆమెకు సమీపంలో కూర్చున్న సంజయ్‌ కుమార్‌ అనే కానిస్టేబుల్‌ కన్ను ఆమెపై పడింది. ఆమెను తాకాలని అతను యత్నించగా, బాధితురాలు వ్యతిరేకించింది. తర్వాత ఆ మృగాడి చేష్టలకు భయపడి, పక్కనున్న మహిళకు సాయం కోరగా, సాయం చేసేందుకు ఆమె విముఖతు వ్యక్తం చేసింది. కోచ్‌లో పోలీసులు కూడా లేకపోవడంతో బాత్‌రూమ్‌లో వెళ్లి గడియ పెట్టుకుని తనను తాను రక్షించుకుంది. ఆపై మూడు గంటల అనంతరం టిసి ఆమె వద్దకు వచ్చి మరో కోచ్‌లో బెర్త్‌ను ఏర్పాటు చేశారు. రైలు గమ్యస్థానానికి చేరిన తర్వాత పోలీసుల రంగ ప్రవేశం చేసి, కానిస్టేబుల్‌ సంజయ్‌ను అరెస్ట్‌ చేశారు.