మూడు దక్షిణాది రాష్ట్రాల్లో ఐటీ తనిఖీలు      

INCOME TAX DEPARTMENT
INCOME TAX DEPARTMENT

హైదరాబాద్‌: ఐటీ శాఖ అధికారులు మూడు దక్షిణాది రాష్ట్రలో గురువారం భారీ స్థాయిలో తనిఖీలు చేశారు.   తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో వందకుపైగా ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. ఇసుక అక్రమ తవ్వకాలతో భారీ సంపాదన, ఆ డబ్బులను చక్కర పరిశ్రమలు, హోటళ్లు, ఇంజినీరింగ్ కళాశాలలు, స్పిన్నింగ్ మిల్లులలో పెట్టుబడులుగా పెట్టడం, పన్ను ఎగవేతకు పాల్పడటం లాంటి ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు . గురువారం తెల్లవారుజామున ఆరు గంటల నుంచి ప్రారంభమైన ఈ సోదాల్లో 130 మందికిపైగా ఐటీ అధికారులు, పలువురు పోలీసులు పాల్గొన్నారని ఐటీ అధికారులు తెలిపారు.