ముస్లిం మైనార్టీలపై క‌ర్ణాట‌క‌ పార్టీల చిన్నచూపు!

Congress Party
Congress Party

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లోమహిళలు,ముస్లింలకు టికెట్‌ కేటాయింపుల్లో అగ్రశ్రేణి పార్టీలుఅంత ప్రాధాన్యతచూపించలేదు. కేవలం 22 మంది మహిళలు, 23గ్గురు ముస్లింలను మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలబరిలోనికి దించుతోంది. బిజెపి, జనతాదళ్‌ఎ స్‌ పార్టీలుసైతం ఇప్పటివరకూ ఈ రెండువర్గాలకు అంతంతమాత్రంగానే సీట్లు కేటాయించాయి. మొత్తం ఇప్పటివరకూ ఈమూడుపార్టీలు 497 మంది అభ్యర్ధులనుప్రకటించాయి. మే 12వ తేదీ జరిగే ఎన్నికలకోసం కాంగ్రెస్‌పార్టీ 15 మంది మహిళలు, 15 మంది ముస్లింలను ప్రకటించింది. మొత్తం 218మంది అభ్యర్ధులను కాంగ్రెస్‌ ఒకే జాబితాగా క్రపటించింది. బిజెపి నలుగురు మహిళలకు సీట్లు కేటాయించింది. అయితే ఒక్కరు కూడా ముస్లింలు లేరు. ఇప్పటివరకూ ప్రకటించిన 154స్థానాల్లో ఏఒక్కరికీ ముస్లిం అభ్యర్ధిగా నామినేషన్‌ ఇవ్వలేదు. అలాగే జెడిఎస్‌సైతం అంతకుమించి చేసిందీలేదు. కేవలం నలుగురు మహిళలు, ఏడుగురు ముస్లింలకు టికెట్లు ఇచ్చింది. మొత్తం 126మంది అభ్యర్ధులనుప్రకటించింది. 2011 జనాభా లెక్కల ప్రకారంచూస్తే మహిళలు 50శాతం జనాభాలో ఉన్నారు. ముస్లింలు 13శాతంగా ఉన్నారు. వ్యక్తిగతంగా ఈరెండుగ్రూపులు మొత్తం అభ్యర్ధుల్లో ఐదుశాతానికిసైతం మించలేదు. రాజకీయ పార్టీలన్నీ కూడా కర్నాటక ఎన్నికల్లో అభ్యర్ధుల విజయావకాశాలాధారంగా టికెట్లు కేటాయించడంతోనే కొన్ని వర్గాలకు మొండిచేయి చూపించాయి. కర్నాటక అసెంబ్లీకి సైతం కేవలం ఆరుగురు మహిళలు, 11 ముస్లింలు ఎమ్మెల్యేలుమాత్రమేప్రాతినిధ్యం వహించారు. 224 మంది ఎమ్మెల్యేలున్న శాసనసభలో అతితక్కువ మంది మాత్రమే నామినేట్‌అయ్యారు. ఎన్నికల్లో విజయమే మా లక్ష్యం ందువల్లనే ఆప్రాతిపదికలో అభ్యర్ధుల ఎంపికజరిగిందని కాంగ్రెస్‌ వర్కింగ్‌ అధ్యక్షుడు గూండూరావు పేర్కొన్నారు. మరికొంతమంది ముస్లిం అభ్యర్ధులు పెరుగుతారని, పార్టీ మరో ఆరునియోజకవర్గాలకు అభ్యర్ధులనుఎ ంపికచేయాల్సి ఉందని వీటిలోశాంతినగర్‌ కూడా ఒకటని ఆయన అన్నారు. జెడిఎస్‌ ముఖ్యమంత్రి అభ్యర్ధి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డి కుమారస్వామి మాట్లాడుతూ ముస్లిం, మహిళల అభ్యర్ధుల సంఖ్యను మరింతపెంచుతుందన్నారు. కేవలం 126 సీట్లకు మాత్రమే ప్రకటించామని, మిగిలినస ఈట్లు ఇంకా ప్రకటించలేదన్నారు. 98 మందితో రెండో జాబితా విడుదలచేస్తామని, ప్రతి గ్రూప్‌నుంచి 15 మందికి తగ్గకుండా అభ్యర్ధులను ప్రకటిస్తామని అన్నారు. సమాజంలో నెలకొన్న అసమానత్వ భావనలే మహిళలను చట్టసభలకు ఎంపికచేయడంలో కూడా తక్కువగా ఉందని మేధావి వర్గాలు చెపుతున్నాయి. దురదృష్టం కొద్దీ పురుషులతో సమానంగా మహిళలు నెగ్గుకురాలేరన్న భావన ఇప్పటికీ ఉందని కొందరు మహిళా నేతలు చెపుతున్నారు. గెలుపే లక్ష్యంగా ఉన్న ఎన్నికల్లో పురుషులు అభ్యర్ధులుగా మద్యం సైతం పంపిణీచేస్తారని, అదే మహిళలు చేయలేరని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఖ్వాజీ అర్షద్‌ ఆలీ మాట్లాడుతూ 1978 ఎన్నికల్లో ఎక్కువ మంది ముస్లిం అభ్యర్ధులు కర్నాటక అసెంబ్లీకి వచ్చారన్నారు. 15మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారని, 2013 ఎన్నికల్లో 11కు ఆ సంఖ్య పడిపోయిందన్నారు. మొత్తం జనాభాలో 13శాతం మంది ముస్లింలు ఉన్నప్పటికీ ఆప్రాతిపదికన వారికి టికెట్లు రావడంలేదన్నారు. అలాగే రాజకీయ పార్టీలమధ్య పోటీమరింతపెరగడం రెండోకారణంగా ఉందని క్వాజీ వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ గట్టిపోటీ నిస్తుండగా ఇతర పార్టీలుసైతం అదేరీతిలోపోటీ ఇస్తున్నాయి. ఇటీవలికాలంలో ఎన్నికల విజయమే పరమావధిగా భావించడంతో పార్టీలోముస్లిం అభ్యర్ధుల సంఖ్యసైతం పడిపోతోందని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్‌సిఎస్టీ కులాలకు చెందినఅ భ్యర్ధుల ఎంపికలో సైతం ఇదే విధానం చోటుచేసుకుంటున్నదని అన్నారు.