మీర‌ట్‌లో అగ్ని ప్ర‌మాదం

FIRE ACCIDNT IN MEERUT
FIRE ACCIDNT IN MEERUT

మీర‌ట్ః ఉత్తర్‌ ప్రదేశ్‌లో మీరట్‌ పరిధిలోని ఆషియానా కాల‌నీ వ‌ద్ద లిసారి మురికి వాడల్లో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 10 అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు తెలియ రాలేదు.
ఆషియానా కాల‌నీ వ‌ద్ద లిసారికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఏడాది మార్చిలో ఇదే ప్రాంతంలోని అషియానా కాలనీలోని మురికి వాడలో జరిగిన అగ్నిప్రమాదంలో వందలాది మంది నివాసాలు కోల్పోయారు.