‘మీటూ’కారణంగా టాటా సంచలన నిర్ణయం!

 

 

TATA
TATA

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటి తనూశ్రీ దత్తాతో ప్రారంభమైన ‘మీటూ’ ఆరోపణలు ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయి. మీటూ ఆరోపణల కారణంగా ఎంతో మంది ప్రముఖలు పదవులు పోగొట్లుకున్నారు.   తాజాగా ప్రముఖ రచయిత, నటుడు సుశీల్ సేథ్‌ వంతు వచ్చింది. ఆయన తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు పలువురు మహిళలు ఆరోపించడంతో టాటా గ్రూప్ కంపెనీ టాటా సన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీ బ్రాండ్ కన్సల్టెంట్‌గా ఆయనతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు ఆయనను వెంటనే పదవి నుంచి  తోలగించింది.