మిత్రపక్షంతో పొత్తు కొనసాగించాలనే ఉంది

nitin gadkari
nitin gadkari

న్యూఢిల్లీ: బిజెపిపై మిత్రపక్షం శివసేన పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయంపై బిజెపి పార్టీ నేత ,కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. శివసేనతో బంధం బలంగా ఉందని, శివసేనతో పొత్తును కొనసాగించాలనే బిజెపి కోరుకుంటున్నదని ఆయన అన్నారు. ఆ పార్టీతో బిజెపికి బంధం హిందుత్వం ఆధారంగా ఏర్పడింది. ఇరు పార్టీల మధ్య ఎటువంటి విభేదాలు లేవు, ఆ పార్టీతో మేము ఇప్పటికీ మిత్రత్వాన్ని కొనసాగించాలనే కోరుకుంటున్నాం. బిజెపితో భాగస్వామిగా ఉండాలో, ప్రతపక్షంగా ఉండాలో ఆ పార్టీ నిర్ణయం తీసుకునే వరకు మా తీరు మారదు అని అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తాము పూర్తి మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పారు.