మా బాస్‌ ఇజ్‌ ఫర్‌పెక్ట్‌: రాజీవ ప్రతాప్‌

Rajiv
Rajiv Pratap

దిల్లీ: సాధించిన విజయాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తాను విఫలమైనట్లు కేంద్రమాజీ మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ తెలిపారు. మంగళవారం ఆయన ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. ‘ఉత్తమమైన దానికోసమే నేను ప్రయత్నించాను. ఫలితాలు కనిపించేందుకు కొంత సమయం పడుతుంది. 2014లో నేను మంత్రిగా ఉన్నప్పుడు యువతకు ఉపాధి కల్పించేందుకు రోడ్‌మాప్‌ను సృష్టించాను. నేను విఫలమయ్యామని బాస్‌ అనుకుని సర్టిఫికెట్‌ ఇస్తే దాన్ని తీసుకోలేను. కానీ బాస్‌ ఎప్పుడు కరెక్ట్‌. ఆయన మార్గదర్శకత్వంలో తక్కువ వ్యవధిలో చేసిన పనిని ప్రజలకు, నా బాస్‌కు చేరవేయడంలో నేను విఫలమయ్యాను అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పదవికీ రూడీ గతవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆదివారం కేంద్రమంత్రి వర్గ విస్తరణలో భాగంగా రూడీకీ కేటాయించిన బాధ్యతలను మరో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పవాన్‌ అప్పగించారు.