మాల్యాపై సమన్లు సమంజసమే

MALLYA
నిలిపివేతకు తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెల్లించాల్సి బకాయిల చెక్కు బౌన్స్‌కేసులో కిందికోర్టు ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు ధృవీకరించింది. అలాగే సమన్లు జారీ ఉత్తర్వులు నిలిపివేయాలంటూ మాల్యాకౌన్సెల్‌ జారీచేసిన పిటిషన్‌పై విచారణజరిపిన హైకోర్టు నిరాకరించింది. కింగ్‌ఫిషర్‌ ఛైర్మన్‌ విజయ్ మాల్యా కు సమన్లు జారీచేసిన కిందికోర్టు ఉత్తర్వులను ధృవీకరిస్తూ మాల్యాకు సమన్లు జారీచేయడం సబ బేనని అభిప్రాయపడింది. బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత సంస్థ ఛైర్మన్‌కు ఉందని వ్యాఖ్యానించింది. ఢిల్లీ అంతర్జాతీయ విమనాశ్రయానికి కింగ్‌ఫిషర్‌ 7.5 కోట్లు బకాయిలకుగాను జారీచేసిన చెక్కులు బౌన్స్‌ అయినట్లు విమానాశ్రయ నిర్వహణసంస్థ కోర్టులో కేసులు దాఖలుచేసింది. విచారణ జరిపిన దిగువకోర్టు ఉత్తర్వులు చట్టవ్యతిరేకమని భావించ లేమని ఉత్తర్వుల అమలు ఆమోదయోగ్యంగా ఉన్నట్లు హైకోర్టు బెంచి అభిప్రాయపడింది. కంపెనీ సిఎండిగా బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత సం బంధిత వ్యక్తికి ఉన్నదని, అంతేకాకుండా కంపెనీ బిజినెస్‌ నియమావళికి ఛైర్మన్‌ వైఖరి అద్దంపడు తుందని హైకోర్టు బెంచ్‌ న్యాయమూర్తులు పేర్కొ న్నారు. ప్రత్యేక నోటీసు జారీచేయాల్సిన అవసరం లేదని, ప్రాసిక్యూట్‌ చేసేందుకు పూర్తి అర్హతలున్నా యని హైకోర్టు వ్యాఖ్యానించింది. మాల్యాకౌన్సెల్‌ వాదిస్తూ తమ క్లయింట్‌ సంస్థ రోజువారి కార్యకలా పాల్లో జోక్యం చేసుకునే అవకాశం లేదని, ఢిల్లీ ఎయిర్‌పోర్టు దాఖలుచేసిన కేసులకు సంబంధించి ఆయన జవాబుదారి కాదని వాదించారు. విచారణ కోర్టు మాల్యాకు సమన్లు జారీచేస్తూ కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ గత నెల 22వ తేదీ జా రీచేసిన కోటిరూపాయల చెక్కు బౌన్స్‌ అయిందని, నిధులు సరిపడాలేవన్న సమాధానం వచ్చిందని అందువల్ల చెక్కును వెనక్కు పంపించారని తెలిపారు. జిఎం ఆర్‌గ్రూప్‌ ఆధ్వర్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టు నిర్వహణ సాగుతోంది. ఐదుగురు కింగ్‌ఫిషర్‌ ఉద్యోగులు బాధ్యులుగా సమన్లు జారీచేసారని వారికి బెయిల్‌ మంజూరయిందని గుర్తుచేశారు.  2014 జనవరి లోనే మేజిస్ట్రేట్‌ మాల్యా విచారణకు హాజరు కావాలని ఆదేశాలుజారీచేసారు. తిరిగి అదేఏడాది సెప్టెంబరులో సెషన్స్‌ జడ్జి అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వులను డిస్‌మిస్‌ చేసారు. తాజాగా హైకోర్టులో చేసిన అప్పీలును బెంచ్‌ న్యాయమూర్తులు తిరస్కరించారు.