మారన్‌ సోదరులపై అభియోగపత్రాలు దాఖలు

Madras High Court
Madras High Court

చెన్నై: అక్రమ టెలిఫోన్‌ ఎక్సేచేంజ్‌ ఏర్పాటు చేసుకున్న మాజీ టెలికాంశాఖ మంత్రి మారన్‌పై,ఆయన సోదరులపై అభియోగాలు నమోదు చేయాలని మద్రాస్‌ హైకోర్టు ధర్మాసనం సిబిఐ ప్రత్యేకకోర్టును ఆదేశించింది. ఈ కేసులో దిగువ కోర్టు వారిని నిర్దోషులుగా విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేసి 12నెలల్లో ట్రయల్‌ పూర్తి చేయాలని మద్రాస్‌ హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. గత మార్చ నెలలో దయానిధి మారన్‌,ఆయన సోదరుడు కళానిధి మారన్‌, ఇతరులపై కేసును కొట్టివేస్తూ వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. దీనిని సిబిఐ సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.