మాజీ ర‌క్ష‌ణ‌మంత్రి చోద‌కుడు ఆత్మ‌హ‌త్య‌

FARMER SUICIDE
Driver Suicide

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎ.కె.ఆంటోని కారు డ్రైవర్ శుక్రవారంనాడిక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ నివాసి అయిన 35 ఏళ్ల సంజయ్ సింగ్ జంతర్‌మంతర్ రోడ్డులోని ఆంటోని అధికార నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనమైంది. ఆత్మహత్య వెనుక నిర్దిష్ట కారణాలేమైనా ఉన్నాయా అనేది ఇంతవరకూ పోలీసుల దృష్టికి రాలేదు. సంజయ్ సింగ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్గం కోసం పంపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.