మహేష్తలలో టిఎంసి పార్టీ విజయం

TRINAMUL CONGRESS WON ASSEMBLY SEAT
TRINAMUL CONGRESS WON ASSEMBLY SEAT

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటుకుంది. సిట్టింగ్‌ స్థానమైన మహేష్తలలో మరోసారి పాగా వేసి తన బలాన్ని నిరూపించుకుంది. బిజెపి అభ్యర్ధి సుజిత్‌ ఘోష్‌ పై టిఎంసి అభ్యర్థి దులాల్‌ చంద్ర దాస్‌ ఘన విజయం సాధించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కస్తూరి దాస్‌ మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. టిఎంసి తరఫున ఆయన భార్య మహేష్తలలో పోటీచేసి 62, 324 ఓట్ల సాధించి సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టారు.