మహారాష్ట్రలో ఎర్రచందనం దుంగలు పట్టివేత

Red sandal wood
Red sandal wood

పుణె: ఖరీదైన ఎర్రచందనం అక్రమ రవాణాను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో కోత్‌రుడ్‌లో చోటు చేసుకుంది. నేర విభాగ పోలీసులు ఓ వ్యక్తి నుంచి 59 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి ఖరీదు సుమారు రూ.3లక్షలు ఉంటుందని సమాచారం. నిందితుడిని అరెస్ట్‌ చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు.